ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి బాట పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. జ్యూరిచ్‌లో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగువాళ్లు సాధించలేనిది ఏమీ లేదని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగువాళ్లు కనిపిస్తారని, తెలుగువాళ్లు ఏ దేశంలోనైనా, ఎక్కడైనా రాణించగలరన్నారు. ఎక్కడికి వెళ్లినా తెలుగువాళ్లను కలవాలనేదే చంద్రబాబు విధానమని.. అన్ని రంగాల్లో చంద్రబాబే తమకు స్ఫూర్తి అని వెల్లడించారు. ''2019-24 మధ్య తెలుగు ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. భవిష్యత్ అంధకారం అనుకునే సమయంలో తెలుగు ప్రజలంతా ఐకమత్యంతో ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు చూపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ ప్రజల్లో నమ్మకం కలిగింది. దేశం, ప్రపంచంలో ఏ ప్రముఖ కంపెనీని చూసినా తెలుగువారే కీలక భూమిక పోషిస్తున్నారు. డెన్మార్క్, బెల్జియం నుంచి నేరుగా ఏపీకి విమాన సర్వీసులు నడిచేలా కనెక్టివిటీ పెంచేందుకు ప్రణాళికలు చేస్తున్నాం'' అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి దార్శనిక నేత చేతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు సురక్షితంగా ఉందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సీనియర్లు, జూనియర్ల కలయికతో ఏపీ కేబినెట్ పటిష్ఠంగా ఉందన్నారు. రిలయన్స్, ఎన్టీపీసీ, టాటా లాంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. ఏపీకి సీబీఎన్ అనే బ్రాండ్ ఉందని.. ఆ బ్రాండే రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొస్తోందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి బాట పట్టిస్తున్నారు !
January 20, 2025
0
Tags