హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా శుక్రవారం మరోసారి రంగంలోకి దిగింది. నగరంలోని మణికొండలో ఉన్న నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. లేక్వ్యూ విల్లాస్ లో అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు. స్థానికులు చెరువు కబ్జాకు పాల్పడి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నిర్ధారణ కావడంతో కూల్చివేతకు హైడ్రా చీఫ్ రంగనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇవాళ ఉదయం అధికారులు కూల్చివేతకు దిగారు. నిర్మాణదార్ల నుంచి ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.
మణికొండ నెక్నాంపూర్ చెరువులో హైడ్రా కూల్చివేతలు !
January 10, 2025
0
Tags