జియో 5.5G నెట్‌వర్క్ ?

Telugu Lo Computer
0

 


జియో 5.5G నెట్‌వర్క్ అనేది 5G సేవలకి అడ్వాన్స్ డ్ వెర్షన్. ప్రస్తుత 5Gతో పోలిస్తే ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్, లో లాటెన్సీ ఇంకా మెరుగైన నెట్‌వర్క్ రిలయాబిలిటీ అందిస్తుంది. ఈ టెక్నాలజీలో ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ ఉంటుంది అలాగే ఒకే సమయంలో వివిధ టవర్‌లకు కనెక్ట్ చేయగల మూడు విభిన్న నెట్‌వర్క్ సెల్స్ ఉపయోగిస్తుంది. దీని ద్వారా యూజర్లు అత్యధికంగా 10Gbps డౌన్‌లోడ్ స్పీడ్ అలాగే 1Gbps వరకు అప్‌లోడ్ స్పీడ్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. జియో సహకారంతో ప్రారంభించిన వన్ ప్లస్ 13 సిరీస్ జియో 5.5G సేవలకు సపోర్ట్ చేసే వాటిలో మొదటిది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకంగా జియో అడ్వాన్స్ డ్ నెట్‌వర్క్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది, ఇవి 5.5Gకి అనుకూలంగా ఉంటాయి. వన్ ప్లస్ 13 సిరీస్ సమయంలో జియో 5.5G సేవలను ప్రదర్శించింది, ఈ టైంలోనే డౌన్‌లోడ్ స్పీడ్ సాధించింది. జియో నాన్-3CC కాంపోనెంట్ క్యారియర్‌లో డౌన్‌లింక్ స్పీడ్ 277.78 Mbpsకి చేరుకుంది, అయితే 3CC కాంపోనెంట్ క్యారియర్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ 1,014.86 Mbpsకి పెరిగింది. జియో 5.5G టెక్నాలజీ యూజర్ల కోసం ఇంటర్నెట్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని, స్ట్రీమింగ్, గేమింగ్ అండ్ ఆన్‌లైన్‌లో వర్క్ చేయడం వంటి పనులను వేగవంతంగా అలాగే అతుకులు లేకుండా చేస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)