కీవే నుంచి కె300 ఎస్ఎఫ్ పేరిట సూపర్ బైక్ !

Telugu Lo Computer
0


కీవే కె 300 ఎస్ఎఫ్ పేరిట సూపర్ బైక్ ను తీసుకొచ్చింది. అయితే కంపెనీ తన సేల్ ను పెంచుకునేందుకు బ్లాక్ బస్టర్ డీల్ ను ప్రకటించింది. ఏకంగా ఈ బైక్ పై రూ. 60 వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ కావాలనుకునే వారు కేవలం రూ. 3 వేలతో బుక్ చేసుకునే ఛాన్స్ కంపెనీ కల్పిస్తోంది. అయితే కంపెనీ తీసుకొచ్చిన ఈ ఆఫర్ మొదటగా కొనుగోలు చేసే 100 కస్టమర్లకు మాత్రమే వర్తించనున్నది. దీనిని రూ.1.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రత్యేక ధరకు సొంతం చేసుకోవచ్చు. కీవే కె300 ఎస్ఎఫ్ 292.4cc లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది 8,750 rpm వద్ద 27.5 hp పవర్, 7,000 rpm వద్ద 25 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఈ బైక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంటుంది. డిస్క్ బ్రేక్‌లతో అధునాతన డ్యూయల్-ఛానల్ ABSని అందించారు. పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీనిలో పెట్రోల్, గేర్ బాక్స్ ఇండికేటర్స్, స్పీడ్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ 12.5 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)