16 పరుగులకే ఆలౌటైన సమోవా : 10 బంతుల్లోనే మ్యాచ్ ని ముగించిన సౌతాఫ్రికా !

Telugu Lo Computer
0


అండర్‌ 19 మహిళల టీ20 ప్రపంచ కప్‌-2025 మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలనం నమోదైంది. సౌతాఫ్రికా జట్టు కేవలం 10 బంతుల్లోనే మ్యాచ్‌ ముగించేసి విజయం సాధించింది. గ్రూప్‌ సిలో భాగంగా సమోవా - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనే దక్షిణాఫ్రికా ఘనత సాధించింది. ఈ పోరులో మొదట బ్యాటింగ్‌ కు దిగిన సమోవా 9.1 ఓవర్లలోనే 16 పరుగుల చేసి కుప్పకూలింది. సమోవా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కావడం గమనార్హం. నలుగురు బ్యాటర్లు కేవలం ఒక్కొక్క పరుగు మాత్రమే చేయగా.. ఇద్దరు బ్యాటర్లు చెరో మూడు పరుగులు చేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో మరో 6 పరుగులు వచ్చాయి. సౌతాఫ్రికా బౌలర్లలో ఎన్‌తబిసెంగ్‌ నిని 3, ఫే కౌలింగ్ , కేలా రేనెకె, శేషిని నాయుడు తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. సమోవా బ్యాటర్లు చేసిన పరుగుల కన్నా దక్షిణాఫ్రికా బౌలర్లు పడగొట్టిన వికెట్ల సంఖ్య (అంకెల్లో) టాప్‌గా ఉన్నాయి. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లే 10 బంతుల్లో 17 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సిమోన్‌ లారెన్స్‌ (6 నాటౌట్‌), జెమ్మా బోతా (6 నాటౌట్‌).. వీరిద్దరు కలిసి 1.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)