సోనీ కెమెరాతో రియల్‌మి 14 ప్రో సిరీస్‌ విడుదల !

Telugu Lo Computer
0


రియల్‌మి 14 ప్రో సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. దీని మొదటి సేల్ జనవరి 23 నుండి ప్రారంభం కానుంది. మొదటి సేల్ కోసం కంపెనీ పలు ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది మెడిటెక్ డైమన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.77 అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఇందులో 8GB RAM + 256GB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.  6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 412×1080 పిక్సెల్ రిజల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్‌తో లాంచ్ చేశారు. ఇది గ్రాఫిక్స్ కోసం Mali G615 GPU ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మి UI 6.0తో పనిచేస్తుంది. OISతో 50-మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇందులో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ Realme ఫోన్‌లో 12GB RAM ఉంది. దీనికి 14GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. 6000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఈ మొబైల్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. మొబైల్ ప్రొటక్షన్ కోసం IP66+IP68+IP69 రేట్ ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, USB టైప్-C, స్టీరియో స్పీకర్లు మొదలైనవి ఉన్నాయి. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో సేల్‌కి రానుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. 8GB RAM + 25GB స్టోరేజ్ ధర రూ.24,999. ఉంది మొదటి సేల్ కారణంగా కంపెనీ పలు ఆఫర్లను అందిస్తోంది. రూ.2000 బ్యాంక్ ఆఫర్, రూ.1000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, 12 నెలల నో కాస్ట్ EMI ఆప్షన్‌లు ఉన్నాయి. ఫోన్ పెరల్ వైట్, పింక్, స్వెడ్ గ్రే కలర్స్‌లో  వస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)