దేశీయ మార్కెట్లోకి ఐక్యూ నియో 10 ఆర్ విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, క్లాసీగా ప్రీమియం లుక్‌లో కనిపిస్తోంది. సోషల్ మీడియా లీక్స్‌ని బట్టి చూస్తే ఈ డివైజ్ పర్పుల్, వైట్ కలర్స్ కాంబినేషన్‌లో డ్యుయల్ టోన్ డిజైన్‌తో వస్తోంది. దీని డిజైన్ ఐక్యూ నియో 9 ప్రో మోడల్ మాదిరిలా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది హై రేంజ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. గేమింగ్ లవర్స్‌కు ఇది మంచి కిక్ ఇవ్వనుంది. ఈ చిప్‌సెట్ సూపర్ పర్ఫార్మెన్స్ కారణంగా, యూజర్లు మల్టీ టాస్కింగ్ చేసినా, గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా ఎక్కడా ల్యాగ్ కాదు. యూజర్లకు స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 15తో రన్ అవుతుంది. డిస్‌ప్లే విషయంలోనూ ఐకూ నియో 10R నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే దీని సొంతం. స్క్రీన్ రిజల్యూషన్ 1.5K కాగా, ఇది 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తుంది. వీటితో పాటు 3840Hz PWM డిమ్మింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. దీంతో నైట్ టైంలో ఫోన్ వాడేటప్పుడు కళ్లపై పెద్దగా ఎఫెక్ట్ పడదు. దీనిలో బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఏకంగా, 6,400 mAh కెపాసిటీ దీని సొంతం. ఈ సిలికాన్- కార్బన్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే, రోజంతా వాడుకోవచ్చు. బ్యాటరీకి తగ్గట్టుగా ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌తో వస్తోంది. ఇది 80W పాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇది డ్యుయల్ కెమెరా సెటప్‌తో రానుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్‌తో SONY LYT- 600 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో వస్తోంది. దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో కూడిన సెకండరీ కెమెరా ఉండనుంది. ఈ రెండు కెమెరాలతో ఫొటోలు క్లారిటీగా, షార్ప్‌గా వస్తాయనడంలో డౌటే లేదు. ఇక, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా దీంట్లో ఉంటుంది.
ఐక్యూ నియో 10 ఆర్ త్వరలో విడుదల !
January 28, 2025
0
Tags