ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా?

Telugu Lo Computer
0


తెలంగాణలోని సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు  తెలిపారు. పంద్రాగస్టు లోగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు.  కాంగ్రెస్‌ బాండ్‌ పేపర్‌ బౌన్స్‌ అయ్యిందని వ్యాఖ్యానించిన ఆయన, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే సీఎం రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే సిద్దిపేటలో రేవంత్‌రెడ్డికి సన్మానం చేస్తానని తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌, ఆ గడువు దాటిపోయినా పత్తా లేదని, ఇప్పుడు ఆగస్టు 15లోగా చేస్తామని చెబుతున్నారని హరీశ్‌ రావు విమర్శించారు. '' పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్‌. తెలంగాణకు, కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి రుణపడి ఉండాలి. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని రేవంత్‌ చెప్పడం పచ్చి అబద్ధం. అది ప్రజలందరికీ తెలుసు'' అని హరీశ్‌రావు అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)