ఓటర్ల కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు !

Telugu Lo Computer
0


మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ నడిచే 339 సర్వీసులతో పాటు 11న 302, 12వ తేదీ 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఒంగోలుకు 38, ఏలూరు 20, మచిలీపట్నం 23, విజయవాడ 45, గుంటూరు 18, నరసరావుపేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నానికి 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌, ఎంజీబీఎస్‌, ఈసీఐఎల్‌, జీడిమెట్ల, రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. బెంగుళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 11వ తేదీన 323, 12న 269 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని తెలిపారు. పోలింగ్‌ తర్వాత తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)