అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం !

Telugu Lo Computer
0


మెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం జరగడం, తన కళ్లెదుటే భర్త మృతి చెందడంతో అతని భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తొంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి అబ్బరాజు వెంకట రమణ కుటుంబం హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలో గల అలకాపురిలో స్థిరపడింది. వెంకట రమణ రెండేళ్ల క్రితం మృతి చెందగా,  అతని కుమారుడు పృద్వీరాజ్ యూఎస్ లోని నార్త్ కరోలినాలో ఎనిమిదేళ్లగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఫృద్విరాజ్ కు గత ఏడాది శ్రీప్రియతో వివాహమైంది. పృద్విరాజ్ భార్య ప్రియతో కలిసి బుధవారం కారులో వెళుతుండగా, మార్గమధ్యలో వర్షం కారణంగా ముందు వెళుతున్న మరో కారును పృద్విరాజ్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వీరి కారు పల్టీ కొట్టింది. తన కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో పృద్వీ, శ్రీప్రియ దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. కారు నుండి బయటకు వచ్చిన పృద్వి  ప్రమాదంపై పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ఫోన్ చేస్తుండగా, వేగంగా వచ్చిన మరో కారు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫృథ్వీ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, పృథ్వీరాజ్ మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)