తమిళనాడులో మద్యం మత్తులో దాడి చేసిన కొడుకుపై తల్లి, అతని పెద్దమ్మ మరిగిన నూనె పోసి హతమార్చారు. పోలీసుల కథనం మేరకు తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపం తెన్నాంగూర్ గ్రామానికి చెందిన సురేష్ (35) మద్యానికి బానిసయ్యాడు. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. రోజూ మద్యం తాగివచ్చి ఇంట్లో ఉన్న తల్లి రుక్మిణి, పెద్దమ్మ మునియమ్మను వేధించేవాడు. ఆదివారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేష్.. తనకు పెళ్లి చేయాలని తల్లి, పెద్దమ్మతో గొడవపడ్డాడు. మద్యానికి బానిసైన అతనికి ఎవరూ పిల్లనివ్వరని అనడంతో ఆగ్రహించిన సురేష్ వారిపై దాడిచేశాడు. ఈ క్రమంలో తల్లి, పెద్దమ్మ మరుగుతున్న వంటనూనె అతని తలపై పోశారు. బాధ భరించలేక కిందపడ్డ అతని తలపై బండరాయితో మోది హతమార్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి నిందితులను అరెస్టు చేశారు.
మరుగుతున్న నూనె పోసి కొడుకును హతమార్చిన తల్లి, పెద్దమ్మ!
May 06, 2024
0
Tags