డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ ప్రాంతంలో జరిగిన వివాహానికి మూడేళ్ల బాలుడు  ఖుశాంత్ సాహు తన తల్లిదండ్రులతో కలిసివెళ్లాడు. వివాహ వేడుకలో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం నిర్వాహకులు డ్రై ఐస్ ను ఉపయోగించారు. ఐస్‌గా భావించిన ఓ చిన్నారి దానిని తిన్నాడు. అనంతరం బాలుడు అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. డ్రై ఐస్‌ను మౌత్ ఫ్రెష్‌నర్‌గా భావించి తినడం వల్ల ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలైన ఘటన ఇటీవల గురుగ్రామ్‌లోని ఓ కేఫ్‌లో చోటుచేసుకుంది. బాధితులు నోట్లో మంటతో రక్తపు వాంతులు చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)