సవాయ్ మాధోపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌, సవాయ్ మాధోపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ గుర్తు తెలియని వాహనం ఆకస్మాత్తుగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత చెందగా, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ క్రమంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జైపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే కారులోని ప్రయాణికులు రణతంబోర్ త్రినేత్ర గణేష్ ఆలయానికి దర్శనం కోసం వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం చాలా ఘోరంగా ఉందని, మృతదేహాలను బయటకు తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా తెలియరాలేదని అన్నారు. గుర్తు తెలియని వాహనం కోసం గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)