ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలించారు. తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో జేసీ నివాసంలో ఉన్న పని మనుషులను, అనుచరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడంతో జేసీ దివాకర్ రెడ్డి.. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్య, దివాకర్ రెడ్డి సోదరి సేవలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి తాడిపత్రికి రావడంతో పోలీసులు జేసీ దివాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. తాడిపత్రిలో ఉంటే సమస్యలు పునరావతమవుతాయని తాడిపత్రి వదిలి వెళ్లాలని కోరారు. జేసీ పవన్ కుమార్ రెడ్డి తన అమ్మ అనారోగ్యంతో ఉందని తన అత్త కదలలేని స్థితిలో ఉండడంతో ఎక్కడికి వెళ్లలేమని చెప్పడంతో పోలీసులు తప్పనిసరిగా తాడిపత్రి వదిలి వెళ్లాల్సిందేనని ఆదేశించారు. చివరకు ఒప్పుకొని పోలీసు బందోబస్తు నడుమ హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు.
భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ కి జేసీ కుటుంబ సభ్యుల తరలింపు!
May 16, 2024
0
Tags