రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారంటూ తమిళిసైపై ఈసీకి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు ?

Telugu Lo Computer
0


సికింద్రాబాద్ ఎమ్మెల్యే కాలనీలో అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై భారత రాష్ట్ర సమితి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. ప్రతిరూపాలను పంపిణీ చేసిన సౌందరరాజన్ చర్య 'ఐపీసీ సెక్షన్ 188, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే' అని బీఆర్‌ఎస్‌ తన ఫిర్యాదులో పేర్కొంది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా చేసుకుని టిఆర్ఎస్ పార్టీ నేతలు గవర్నర్ తమిళసై మీద బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేళారు. టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 'తమిళిసై సౌందరరాజన్ మతం ప్రాతిపదికన పార్టీని ప్రోత్సహించాలనే ఆదేశాన్ని ధిక్కరించి, సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బిజెపి పార్టీ అభ్యర్థి రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో సాధారణ ప్రజలకు రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టానికి ఇది విరుద్ధం'' అని ఫిర్యాదులో పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)