ఓయో హోటల్స్‌ మూసివేతపై దంపతుల వినూత్న నిరసన !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని వైశాలి నగర్‌లో ఓయో రూమ్స్‌ ముసుగులో వ్యభిచార వ్యాపారం జరుగుతోందని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రికేష్ సేన్ ఆరోపించారు. పోలీసులతో కలిసి ఓయో హోటల్స్‌పై దాడులు చేయించి వాటిని మూసివేయించారు. దీనిపై ఓ దంపతులు వినూత్నంగా నిరసన తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రికేష్ సేన్ క్యాంపు కార్యాలయం బయట ముద్దుల్లో మునిగిపోయారు. వైశాలి నగర్‌లో ఓయో రూమ్స్‌ను ఆ ఎమ్మెల్యే మూయించడంపై ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇది చూసేందుకు జనం అక్కడ గుమిగూడారు. మరోవైపు అక్కడకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రికేష్ సేన్ ఆ దంపతుల ప్రవర్తనను నిలదీశారు. అయితే ఆ ప్రాంతంలోని ఓయో రూమ్స్‌ను ఆయన మూయించడంతో తాము ఎక్కడికి వెళ్లలేకపోతున్నట్లు వారు చెప్పారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే ఆఫీస్‌ వద్ద ఆ దంపతులు ముద్దుల్లో మునిగిపోయిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)