కేఏ పాల్‌పై కేసు నమోదు !

Telugu Lo Computer
0


ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎల్బీనగర్‌ టికెటిస్తానని చెప్పి కేఏ పాల్‌ రూ.56 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కిరణ్‌కుమార్‌ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడకు చెందిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాడు. ఈ నేపథ్యంలో కేఏ పాల్‌ను సంప్రదించి ఎల్బీనగర్‌ టికెట్‌ ఇవ్వాలని కోరాడు. అయితే తనకు రూ.56 లక్షలు ఇవ్వాలని పాల్‌ అడగ్గా.. కిరణ్‌ ఆన్‌లైన్‌, ఇతర మార్గాల ద్వారా డబ్బు చెల్లించాడు. అయినా అసెంబ్లీ టికెట్‌ ఇవ్వలేదు. డబ్బులు కూడా తిరిగివ్వలేదు. పలుమార్లు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో కిరణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)