బాల్‌ జీవన్‌ భీమా యోజన !

Telugu Lo Computer
0


పోస్టు ఆఫీస్‌ లో మహిళలకు వృద్ధలుకు, పిల్లలకు రకరకాల స్కీమ్స్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు పిల్లల పేరిట పోస్టు ఆఫీసులో మరో కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది. ఇక ఆ పథకం పేరే బాల్‌ జీవన్‌ భీమా యోజన. ఈ పథకంలో కేవలం రోజుకు రూ. 6 పొదుపు చేస్తే చాలు. మెచ్యూరిటీ సమయంలో కనీస హామీ మొత్తంలో లక్ష రూపాయల రాబడి పొందుతారు. ఒక వేళ మీరు రూ.18 పొదుపు చేస్తే 3 లక్షల రూపాయలు పొందవచ్చు. ఇలా పొదుపు చేసే వారి స్థోమతను బట్టి రోజుకు రూ..6 లేదా రూ.18 వరకు ఉంటుంది. అయితే పొదుపు అనేది పిల్లల పేర్ల మీద మాత్రమే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల వయసు కనీసం 5 నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే తల్లిదండ్రులు వయసు కూడా ఈ స్కీమ్‌ పెట్టుబడికి పరిగణలోకి తీసుకుంటారు. ఈ స్కీమ్‌ లో తల్లిదండ్రులకు కనీస వయసు 45 ఏళ్లకు మించి ఉండకూడదు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు ఈ స్కీమ్‌ వర్తించదు. కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. కాగా, ఇద్దరు పిల్లల మీద రోజుకు రూ.36 పొదుపు చేస్తే మెచ్చూరిటీ సమయానికి ఇద్దరిది కలిపి మొత్తం రూ. 6 లక్షల వరకు పొందే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మీరు సమీపంలోని పోస్టాఫీస్ కు వెళ్లి సంబంధిత అధికారులను సంప్రదించి ​ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక అందులో మీరు అర్హులుగా ఉంటే ఈ స్కీమ్ లో చేరవచ్చు. అలాగే దరఖాస్తుదారు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించి అకౌంట్​ను ఓపెన్ చేయవచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)