తమిళనాడులో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో టెంకాసిలోని పాత కొర్టాలమ్ జలపాతానికి ఆకస్మిక వరద పోటెత్తింది. ఒక్కసారిగా వరద ముంచుకురావడాన్ని గమనించిన సందర్శకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వరద ముంచెత్తడంతో స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జలపాతం సందర్శనలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. తమిళనాడు అగ్నిమాపక, రక్షణ విభాగానికి చెందిన ఓ బృందం వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
కొర్టాలమ్ జలపాతానికి ఆకస్మిక వరద !
May 17, 2024
0
Tags