కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌లో చిందులు వేసిన డాక్టర్లు, సిబ్బంది !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌లో పని చేసిన మహిళా ఉద్యోగిని పదవీ విరమణ చేసింది. దీంతో ఆమెకు వీడ్కోలు పలికేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దగా డ్రమ్స్‌ వాయించగా డాక్టర్లు, వైద్య సిబ్బంది డ్యాన్సు చేశారు. రోగులను పట్టించుకోకుండా డప్పుల శబ్దం మధ్య చిందులు వేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేశారు.  కాగా, ఆ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. డప్పు శబ్దాలను భరించలేక వేదన అనుభవించారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు, సిబ్బంది తీరుపై పలువురు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో రోగులను పట్టించుకోకుండా డాక్టర్లు, సిబ్బంది డ్యాన్సులు చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. మరోసారి ఇలా జరుగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)