ఎన్నికల వేళ టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు !

Telugu Lo Computer
0


సార్వత్రిక ఎన్నికల వేళ  దాదాపు రెండు వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. కాగా, శుక్ర, శని, ఆదివారాల్లో నడిచే 450 బస్సుల్లో రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సొంత ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు పల్లె బాట పడుతున్నారు. వరుస సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్ లో ఉండే వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల వారు ఓటేసేందుకు ఎలక్షన్ జర్నీకి సిద్ధం అయ్యారు. మే 13న పోలింగ్‌ ఉండగా, 11న రెండో శనివారం, 12న ఆదివారం సెలవు ఉండటంతో ముందుగానే సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా శుక్రవారం నుంచే ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)