మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్‌ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర, వడ్డీ వ్యాపారి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ దాడిలో సుమారు రూ.25 కోట్ల నగదు, ఇతర విలువైన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు అధికార పార్టీకి చెందిన వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో వైకాపా నాయకుడు దారా శ్రీనివాసరావు ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉంచిన రూ.31లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు 18వ వార్డు వైకాపా కౌన్సిలర్‌ నీలిమ భర్త శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు ఏసీపీ ప్రకాశ్‌బాబు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)