బండ రాయి కింద బయటపడ్డ లంకెబిందెను తెరవగా లోపలి నుంచి ఓ పాము బుసలుకొడుతూ బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. కొందరు నిధి కోసం వెతికే క్రమంలో ఓ పెద్ద బండరాయిని తొలగించాల్సి వస్తుంది. ఇందుకోసం రాయి చుట్టూ గొలుసు కట్టి, ట్రాక్టర్ సాయంతో లాగుతారు. బండరాయిని పక్కకు తొలగించగానే.. భూమిలోపల కూజా లాంటి ఆకారంలో ఇనుప వస్తువు బయటపడుతుంది. దాన్ని పక్కకు తీసుకొచ్చి మూతను తెరుస్తారు. అయితే ఆశ్చర్యకరంగా అందులో నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వస్తుంది. పాము బయటికి రావడంతో వారు ఒక్కసారిగా కంగారుపడతారు. పామును తొలగించిన తర్వాత అందులో ఉన్న బంగారు నాణేలను అన్నింటినీ పక్కకు తీస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''వామ్మో..! ఇదేంటీ మరీ విచిత్రంగా ఉంది''.. అంటూ కొందరు, ''భూమిలోపల పాత్రలో పాము బతికి ఉండడం అసాధ్యం. ఇదంతా ఫేక్''.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోన్న లంకె బిందె మీడియా !
April 18, 2024
0
Tags