బీహార్‌లోని బంకా జిల్లాలోని చత్రపాల్ పంచాయతీ హీర్ మోతీగావ్‌లో దిలేశ్వర్ ధర్వే, గీతా దేవీ భార్యా భర్తలు నివసిస్తున్నారు. వీరి కుమార్తెను సికిందర్ యాదవ్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. సికిందర్ భార్య చనిపోవడంతో అత్తమామలతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో అత్త, అల్లుడు ఒకరికొకరు దగ్గరయ్యారు. వీరి బంధంపై అనుమానం ఏర్పడింది అలా వీరిద్దరిన్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు గీతాదేవీ భర్త. ఈ విషయాన్ని పంచాయతీ పెద్దల వద్దకు తీసుకెళ్లాడు. పంచాయతీ పెద్దల ముందు సికిందర్ యాదవ్.. అత్తతో తనకున్న అక్రమ సంబంధం గురించి చెప్పాడు. ఆమెతోనే ఉంటానంటూ చెప్పడంతో.. గీతాదేవిని వివాహం చేసుకోవాలని చెప్పారు పెద్దలు. ఇందుకు గీతా దేవి భర్త దిలేశ్వర్ కూడా అంగీకరించడం గమనార్హం. గ్రామస్థుల ఆమోదంతో ఆమె నుదిటిన సింధూరం దిద్దాడు సికిందర్. అలా అత్తకు ఇప్పుడు రెండో భర్తగా మారాడు అల్లుడు. ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఇక పోతే భార్యను అల్లుడికి దానం చేసిన మామ దిలేశ్వర్..వీరి పెళ్లిని అధికారికంగా రిజిస్టర్ చేయించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశాడు. అత్తను పెళ్లి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అలాగే నైతిక విలువలపై పెదవి విరిచేలా చేస్తున్నాయి. అమ్మ తర్వాత ఆ పాత్ర పోషించే అత్తతో అల్లుడు రొమాన్స్ చేయడం ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది.
అత్తను పెళ్లాడిన అల్లుడు !
April 29, 2024
0
Tags