ఆంధ్రప్రదేశ్‌లో ఆసరా పెన్షన్ల పంపిణీ నుండి కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లను తప్పించడంతో పెన్షన్‌దారులు హైకోర్టు ను ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి దగ్గరే పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు పిటిషన్‌లో కోరారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే ఇబ్బందులు పడతామని తెలిపారు. పెన్షనర్ల పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం. దీంతో హైకోర్టు పెన్షన్‌దారుల పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తుందా..? ఒక వేళ ఈ పిటిషన్‌పై విచారణ జరిపితే ఎలాంటి తీర్పు వస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, పెన్షన్ల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ నుండి ఎన్నికల కోడ్ ముగిసేవరకు వాలంటీర్లను తొలగించాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. వాలంటీర్ల తొలగింపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ వల్లే వాలంటీర్లను తొలగించారని వైసీపీ విమర్శిస్తుంది. ఈ క్రమంలో హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ !
April 02, 2024
0
Tags