రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన భాజపా నేతలు !

Telugu Lo Computer
0


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురు భాజపా నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మక్తల్‌ భాజపా నేత జలంధర్‌రెడ్డితో పాటు సంగారెడ్డి ఇన్‌ఛార్జి పులిమామిడి రాజుకు సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి, మంత్రి కొండా సురేఖ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)