బడా వ్యాపారస్తులే లక్ష్యంగా కొనసాగుతున్న గేమింగ్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ కి చెందిన మాధవి అనే మహిళ బడా వ్యాపారులకు వల వేసి వారిని గేమింగ్‌లోకి దింపుతోంది. ఈ మేరకు ఖాజాగూడలో ఏకంగా ఓ గేమింగ్ స్థావరాన్నే నడుపుతోంది. అదేవిధంగా విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తూ అందిన కాడికి దండుకుంటుంది. అయితే, గేమింగ్ పాల్గొని ఇటీవలే కొంతమంది బడాబాబులు రూ.లక్షల్లో నష్టపోయారు. దీంతో సమాచారం అందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఖాజాగూడలోని గేమింగ్ స్థావరంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ మేరకు రూ.62 వేల నగదును సీజ్ చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు
గేమింగ్ ముఠా గుట్టు రట్టు !
April 30, 2024
0
Tags