ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 10వ వార్డులో సరిత అనే యువతిపై మేనమామ శిఖా వెంకటేష్ కత్తితో ముఖంపై దాడి చేశాడు. దీంతో ఆమె ముఖంపై రక్త స్రావమైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించగా ప్రాథమిక చికిత్స చేసి గుంటూరుకు పంపారు. కళ్ల సమీపంలో కత్తితో దాడి చేయడంతో కళ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశముందని వైద్యులు తెలిపారు. కాగా గత 15 రోజుల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటేష్ కుటుంబ సభ్యులపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా తమ పైనే ఫిర్యాదు చేస్తావా అంటూ వెంకటేష్ కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు బాధితురాలు తెలిపింది. దీనిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మేనకోడలి మేనమామ కత్తితో దాడి !
April 12, 2024
0
Tags