హరిరామ జోగయ్య కొడుకు జనసేన పార్టీకి రాజీనామా !

Telugu Lo Computer
0


నసేన పార్టీకి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్‌ జనసేన పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. జనసేన పీఏసీ మెంబర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆచంట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్‌గా కూడా ఆయన కొనసాగుతున్నారు. అయితే ఆచంట టికెట్ టీడీపీకి కేటాయించడంతో నిడదవోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ టికెట్ ఆశించారు. ఇక్కడ కూడా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో అధికార వైసీపీ వైపు మొగ్గుచూపారు. శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కాసేపట్లో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పాలకొల్లు అసెంబ్లీ నియోజవర్గం వైసీపీ ఇన్‌చార్జ్‌గా సూర్యప్రకాశ్‌ను నియమించే అవకాశం ఉందని సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)