పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్

Telugu Lo Computer
0


పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. పాకిస్థాన్ పార్లమెంటులో షెహబాజ్ షరీఫ్ కు 201 మంది సభ్యుల మద్దుతు లభించింది. ప్రధాని అయ్యేందుకు 169 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఆయనకు అంతకంటే ఎక్కువ మంది మద్దతు పలికారు. ఇటీవల పలు వివాదాల నడుమ పాక్ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్, పీపీపీ కూటమి విజయం సాధించింది. ప్రధాని నియామకం కోసం ఇవాళ పాక్ పార్లమెంటులో ఓటింగ్ జరిగింది. అందులో అత్యధికులు షెహబాజ్ షరీఫ్ నాయకత్వాన్ని బలపరిచారు. ఈ ఓటింగ్ లో ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ అభ్యర్థి ఉమర్ అయూబ్ ఖాన్ కు కేవలం 92 మంది సభ్యుల మద్దతు లభించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)