గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మెటా ప్లాట్‌ఫామ్‌ల సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, ప్రముఖ హాలీవుడ్ సింగర్ రిహానాతో పాటు మరెందరో అతిరథ మహారథులు హాజరయ్యారు. రిహానాకు భారీ పారితోషికం ఇచ్చి మరీ ఇక్కడికి రప్పించారు. అయితే ఈ ఫంక్షన్‌లో ఆమెకు అనుకోకుండా ఒక చేదు అనుభవం ఎదురైంది. తాను పెర్ఫామ్ చేస్తున్న సమయంలో దుస్తులు చిరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ కోసం రిహాన ఆకుపచ్చ బాడీకాన్ షిమ్మరీ గౌనును ధరించింది. అతిథుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం వేదికపై పెర్ఫామ్ చేయడం మొదలుపెట్టింది. తన పెర్ఫామ్ సమయంలో 'డైమండ్స్', 'రూడ్ బాయ్', 'పోర్ ఇట్ అప్'లతో పాటు మరెన్నో హిట్ పాటల ప్రదర్శనతో అతిథుల్ని ఆకట్టుకుంది. ముకేష్ భార్య నీతా అంబానీ సైతం వేదికపైకి ఎక్కి.. రిహానాతో కలిసి కాసేపు పెర్ఫామ్ చేసింది. ఇలా పెర్ఫామ్ చేస్తున్న సమయంలోనే రిహానా అండర్ ఆర్మ్ వద్ద దుస్తులు చిరిగాయి. ఈ దుస్తులు మరీ పలుచగా ఉండటం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె పట్టించుకోకుండా తన పెర్ఫార్మెన్స్ కొనసాగించడం గమనార్హం. ఏదేమైనా.. ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో వెంటనే క్లిక్‌మనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో ఇంత విలాసవంతమైన ఫంక్షన్‌లో రిహానాకు మంచి దుస్తులు కూడా అందలేదా? అంటూ నెటిజన్లు సెటైర్లు వేసుకుంటున్నారు.
ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో రిహానాకు చేదు అనుభవం ?
March 02, 2024
0
Tags