డీకే శివకుమార్‌ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి !

Telugu Lo Computer
0


ర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో బీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో డీకే శివకుమార్‌తో సమావేశం అయ్యారు. శుక్రవారం ప్రియాంక గాంధీని కలిసేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మర్రి రాజశేఖర్‌రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. తప్పుడు ప్రచారం అంటూ మల్లారెడ్డి కొట్టిపారేశారు. ఇంతలోనే పరిణామాలు మారిపోవడంతో రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక డీకే శివకుమార్‌తో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదన్నారు. ఈ అయిదేళ్లు మాత్రమే ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. ఉన్నన్నాళ్లు బీఆర్ఎస్‌లోనే ఉంటానని చెప్పారు. డీకే శివకుమార్‌ను కలవడంపై ప్రశ్నించగా  ఓ ప్రయివేటు కార్యక్రమంలో డీకే శివకుమార్‌ను కలిశానన్నారు. ఆయన్ని కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. డీకే శివకుమార్ తనకు స్నేహితుడని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)