తెలంగాణలోని మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సదాశివపల్లికి చెందిన కృష్ణ గౌడ్ అనే రైతు తన చెరుకు పంటకు నిప్పు పెట్టారు. తన పొలంకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో చెరువు కట్ట పైనుండి దారి ఏర్పాటు చేసుకోగా కొందరు దానిని అడ్డుకున్నారు. పంట తరలించే అవకాశం లేనందున అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో చెరుకు పంటకు నిప్పు పెట్టి నిరసన తెలిపాడు.
చెరకు పంటకు నిప్పు పెట్టిన రైతు !
March 03, 2024
0
Tags