రేవంత్‌ను ఖమ్మం, నల్గొండ బాంబులే ఏదైనా చేయొచ్చు !

Telugu Lo Computer
0


బీఆర్ఎస్ కదనభేరి సన్నాహాక సమావేశంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కరీంనగర్‌ లో మాట్లాడుతూ కరీంనగర్‌ అంటే భారాస అధినేత కేసీఆర్‌కు సెంటిమెంటని, ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే జంగ్‌ సైరన్ మోగించారని గుర్తు చేశారు. ఇప్పుడు అబద్ధాల సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ''పాలమూరు సభలో సీఎం భాష నాకైతే అర్థం కాలేదు. గొంతు కోస్తా, మానవ బాంబై పేలుతా అంటున్నారు. ఆయన పక్కనే మానవ బాంబులు ఉన్నాయి. అవే ఆయనను కూల్చుతాయి. రేవంత్‌ను ఖమ్మం, నల్గొండ బాంబులే ఏదైనా చేయొచ్చు. భారాస నుంచి ఆయనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. సీఎంగా రేవంత్‌ ఐదేళ్లు నిక్షేపంగా ఉండాలి. ఐదేళ్ల పాలన చూశాకే ఎవరు గొప్పవాళ్లో ప్రజలకు తెలుస్తుంది. ఇది కాలం తెచ్చిన కరవు అని సీఎం అంటున్నారు. కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చింది. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వొచ్చు. కానీ, కేసీఆర్‌ని బద్నాం చేయాలని రిపేర్‌ చేయడం లేదు. పదేళ్లు మోడీ ప్రధానిగా, ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. కరీంగనగర్‌కు మీరేం చేశారో అంతకుముందు వినోద్ కుమార్ ఏం చేశారో తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా?'' అని సవాల్‌ విసిరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)