బీజేపీలో చేరిన బీఆర్ఎస్‌ నాయకులు

Telugu Lo Computer
0


బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నలుగురు నేతలు బిజెపి పార్టీలోకి చేరారు. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎంపీలు నగేష్, సీతారాం నాయక్ టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈరోజు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో కాషాయ పార్టీ తీర్థం తీసుకున్నారు.ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ నలుగురికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. కాగా, ఈ నలుగురు నేతలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు వారు బిజెపిలో చేరినట్లు తెలుస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)