విశాఖ రాజధానిపై సీఎం జగన్ వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎక్స్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని షర్మిల ప్రశ్నించారు. విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ అని విమర్శించారు. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్ అని ఎద్దేవా చేశారు. విశాఖలో గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే వైసీపీ విజన్ అని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారని షర్మిల ఎక్స్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూములను మింగడం వైసీపీ విజన్ !
March 06, 2024
0
Tags