రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా !

Telugu Lo Computer
0


వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ నియోజకవర్గంలో పేదరికం లేకుండా చేయడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. లోకేశ్‌ సమక్షంలో ఎర్రబాలెం, కురగల్లు, నిడమర్రు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తెదేపాలో చేరారు. 2019లో తాను ఓడిపోయినా.. నియోజకవర్గంలోనే ఉండి దాదాపు 29 కార్యక్రమాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ సారి తనను భారీ మెజార్టీతో శాసనసభకు పంపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)