తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో  జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండోజాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. 94 స్థానాలతో మొదటి జాబితాను విడుదల చేసిన టీడీపీ ఇవాళ 34 మందితో రెండో జాబితా విడుదల చేసింది. టీడీపీ రిలీజ్ చేసిన రెండో జాబితాలో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఇద్దరు ఉన్నారు. 36 నుంచి 45 వయసు మధ్య ఉన్న వాళ్లు 8 మంది ఉన్నారు. 46 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు 19 మంది ఉన్నారు. 61-75 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు ముగ్గురే ఉన్నారు. 75 ఏళ్లకు పైబడిన వాళ్లు ఇద్దరు ఉన్నారు. రెండో జాబితాలో పురుషుల సంఖ్య 27 మంది ఉన్నారు... స్త్రీలు ఏడుగురు ఉన్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో పీహెచ్డీ చేసిన వాళ్లు ఒకరుంటే.. పీజీ చేసిన వాళ్లు 11 మంది ఉన్నారు. డిగ్రీ మాత్రమే చదివిన వాళ్లు 9 మంది ఉన్నారు. ఇంటర్తో చదువు ఆపేసిన వాళ్లు 8 మంది ఉన్నారు. అంతకంటే తక్కువ చదివిన వాళ్లు ఐదుగురు మాత్రమే ఉన్నారు 

Post a Comment

0Comments

Post a Comment (0)