18 మంది జనసేన అభ్యర్థుల ప్రకటన !

Telugu Lo Computer
0


నసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది. వంశీ కృష్ణ యాదవ్ పేరుపై అభ్యంతరాలు రావడంతో వంశీ పేరును పవన్ హోల్డ్‌లో పెట్టినట్లు తెలిసింది. పాలకొండకు పడాల భూదేవి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారు. అవనిగడ్డ సెగ్మెంటుకు వల్లభనేని బాలసౌరీ, బండ్రెడ్డి రామకృష్ణ పేర్ల పరిశీలనలో ఉన్నాయి. జనసేన పోటీ చేసే బందరు పార్లమెంటు స్థానాన్ని జనసేన పెండింగులో పెట్టింది. బాలసౌరి పేరు అవనిగడ్డకు పరిశీలిస్తుండడంతో బందరు పార్లమెంట్ స్థానం పెండింగులో పడింది. కాకినాడ లోక్‌సభ – తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌. అసెంబ్లీ అభ్యర్థులుగా పిఠాపురం- పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల – లోకం మాధవి, అనకాపల్లి – కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ – పంతం నానాజీ, రాజానగరం – బత్తుల బలరామకృష్ణ, తెనాలి – నాదెండ్ల మనోహర్, నిడదవోలు – కందుల దుర్గేష్, పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్, పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ, రాజోలు – దేవ వరప్రసాద్, తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం – పులపర్తి ఆంజనేయులు, నరసాపురం – బొమ్మిడి నాయక్, ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు, పోలవరం – చిర్రి బాలరాజు, తిరుపతి – ఆరణి శ్రీనివాస్, రైల్వే కోడూరు – డా.యనమల భాస్కరరావు. 

Post a Comment

0Comments

Post a Comment (0)