శ్రీశైలం పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక ?

Telugu Lo Computer
0


శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఆలయ పరిధిలోని అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం వద్ద ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ప్రసాదం స్వీకరించిన భక్తుడు హరీష్ రెడ్డికి పులిహోరలో మాంసపు ఎముక కనిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దేవస్థానం అధికారులకు లిఖితపూర్వకంగా ఎముక ముక్కను చూపించి ఫిర్యాదు చేశాడు. పవిత్రమైన పుణ్య క్షేత్రంలో ఈ అపచారం ఏంటని సదరు భక్తుడు ప్రశ్నించాడు. ఇలాంటి ఘటనలతో పుణ్యక్షేత్రాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రసాదంలో మాంసపు ఎముక వచ్చిందంటూ హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన భక్తుడు ఏకంగా కంప్లయింట్ చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పులిహోరలో మాంసపు ఎముకపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని భక్తుడు హరీష్ రెడ్డి స్వయంగా కంప్లయింట్ ఇవ్వటంతోపాటు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)