తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఇక త్వరలోనే జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలో బరిలో దిగుదామని సవాల్ విసిరారు. ఎవరు గెలుస్తారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డికి మల్కాజిగిరి స్థానం సిట్టింగ్ సీటు అని, అతనికి బలం ఉన్న చోటే పోటీ పడదామన్నారు కేటీఆర్. సేఫ్ గేమ్ వద్దు.. డైరెక్ట్‌గా ఫైట్ చేద్దామంటూ చాలెంజ్ చేశారు. ఈ మేరకు మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గతంలోనూ రేవంత్ సవాల్ చేసి పారిపోయారని చెప్పారు. కొడంగల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సవాల్ చేసిన రేవంత్ పారిపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. సవాల్ చేయడం.. ఆ తర్వాత పారిపోవడం.. ఇలా చేస్తున్న ఆయన మాటకు విలువేముందని ప్రశ్నించారు. తనది మేనేజ్‌మెంట్ కోటా అయితే రాహుల్, ప్రియాంకగాంధీలది ఏ కోటా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక రేవంత్‌ది మాత్రం పేమెంట్ కోటా అనీ.. డబ్బులిచ్చి మరీ పదవిని తెచ్చుకున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ !
February 29, 2024
0
Tags