ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సొంతగూటికి చేరారు. డిసెంబర్ 11 వ తేదీన తన ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్సార్ సీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు. 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచారు. రాజధాని ప్రాంతంలో ఆ పార్టీకి కీలకనేతగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఓడించారు. అమరావతిలో అనేక కుంభకోణాలు జరిగాయంటూ చంద్రబాబుపై కోర్టుల్లో కేసులు వేసి న్యాయపోరాటం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అత్యంత విధేయుడిగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి కొనసాగారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఉన్నట్లుండి రాజీనామా ప్రకటన చేశారు గతేడాది డిసెంబర్ 11వ తేదీన అసెంబ్లీకి వెళ్లి తన రాజీనామా లేఖను స్పీకర్ చాంబర్ లో అందించారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీసుకున్న నిర్ణయం అప్పట్లో రాజకీయంగా సంచలనంగా మారింది. ఆర్కే రాజీనామాను ప్రతిపక్షాలు తమకు అస్త్రంగా మార్చుకున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి సొంతగూటికి చేరనున్నారు.
సొంత గూటికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ?
February 20, 2024
0
Tags