ప్రశాంతత లేదని ట్వీట్‌ - తెల్లారేసరికి ఉద్యోగమే ఊడింది !

Telugu Lo Computer
0


బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ఉద్యోగి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ప్రస్తుత ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ప్రశాంతంగా లేనని, కాన్ఫిడెన్స్ లెవెల్‌ తగ్గిపోతోందని ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన మరుసటి రోజే అతని ఉద్యోగం ఊడిపోయిందని, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నానని, ఏదైనా జాబ్ ఉంటే చెప్పండని మరో ట్వీట్ చేశాడు. ఫోర్మా అనే కంపెనీలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ 'జిష్ణు మోహన్' అనే వ్యక్తి 2019లో కొచ్చి నుంచి బెంగరూరు వచ్చి జాబ్ చేసుకుంటున్నాడు. ఇటీవల అతడు జాబ్ కోల్పోయే సమయానికి ఫుల్ టైమ్ రిమోట్ ఎంప్లాయ్‌గా పనిచేస్తున్నాడు. ఒక్క ట్వీట్ వల్ల ఉద్యోగం పోవడంతో ఇప్పుడు ఇతడే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. జిష్ణు మోహన్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు రెస్యూమ్ పంపమని అడగ్గా, ఇంకొందరు ఓపెన్ పొజిషన్స్ గురించి కామెంట్ సెక్షన్లలోనే ఆఫర్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)