హెలికాప్టర్‌ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు మృతి

Telugu Lo Computer
0


హెలికాప్టర్‌ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్‌ పినేరా (74) మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో పినేరా ప్రయాణిస్తుండగా అది కూలిపోయింది. దీంతో ఆయన మృతిచెందగా, మిగతావారు గాయాలతో బయటపడ్డారు. ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన పినేరా మొదట 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు చిలీ దేశాధ్యక్షుడిగా ఉన్నారు. బిలియనీర్‌ అయిన ఆయన చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయన మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)