బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


బుల్లెట్ ప్రూఫ్ కాఫీనే బుల్లెట్ కాఫీ అని కూడా అంటారు. ఈ కాఫీని అల్పాహారానికి ఒక ప్రత్యామ్నాయంగా చెప్తారు. అంటే ఈ కాఫీ తీసుకుంటే అల్పాహారం చేసేసినట్లే. బుల్లెట్ కాఫీ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమి కాదు చాలా పాతదే. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బరువు తగ్గడంతో పాటు శరీరంలో మంచి కొవ్వును ప్రోత్సహిస్తుంది. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీకు శక్తిని అందించడమే కాకుండా మీ జీర్ణ శక్తిని నిర్వహించడానికి, ఆకలిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బుల్లెట్‌ప్రూఫ్ కాఫీలో ఉండే కీటో లక్షణాలు శక్తిని పొందడానికి పిండి పదార్థాలకు బదులుగా కొవ్వును కాల్చేస్తాయి, దీని కారణంగా శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోదు. కొవ్వును కాల్చే ఈ ప్రక్రియను కీటోసిస్ అంటారు. ఇది శక్తిని అందించడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ అనేది కాఫీ పొడి, నూనె అలాగే వెన్న కలిసి ఉండే పానీయం.

Post a Comment

0Comments

Post a Comment (0)