ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి వీ.వీ మహాల్ రోడ్డులోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే పరుగుతీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో చెప్పులు దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఆ షాపు పైనే ఓ ఇల్లు ఉందని దుకాణం యజమాని తెలిపాడు. అంతేకాకుండా ఆ ఇంట్లో సిలిండర్లు ఉన్నాయని చెప్పడంతో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం !
February 25, 2024
0
Tags