అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన చేతిపై ఎర్రని మచ్చలు దర్శనమిచ్చాయి. దాంతో ఆయనకు ఏమైందంటూ నెట్టింట్లో ఒకటే చర్చ నడిచింది. ఈ విషయంపై తాజాగా ట్రంప్ తనదైన శైలిలో బదులిచ్చారు. కొద్దిరోజుల క్రితం తన మాన్‌హట్టన్ అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వచ్చిన ట్రంప్ అభిమానులను చూస్తూ గాల్లోకి చేతిని ఊపారు. అప్పుడే ఆయన చేతిపై ఎర్రని మచ్చలను ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. తర్వాత ఆ చిత్రాలు వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా ఓ మీడియా సంస్థ ప్రశ్నించింది. 'మీ చేయి ఎలా ఉంది..?' అని అడిగారు. 'నా చేయా..?' అంటూ ఆయన ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయారు. 'మీరు ఫొటోలు చూడలేదా..?' అని మళ్లీ ఆయన్ను అడగ్గా.. 'నేను ఆ ఫొటోలు చూడలేదు. నా చేతులకు ఏమీ కాలేదు. అదంతా ఏఐ (కృత్రిమ మేధ) వల్ల కావొచ్చు' అని మాజీ అధ్యక్షుడు బదులిచ్చారు. అయితే ఆ ఎర్రని మచ్చలపై నెటిజన్లు పలు ఊహాగానాలు చేశారు. ఇన్ఫెక్షన్ కావొచ్చని కొందరు, కెచప్ లేక ఎర్ర సిరా అంటి ఉండొచ్చని ఇంకొందరు కామెంట్లు పెట్టారు.
ట్రంప్ చేతిపై ఎర్రని మచ్చలు ?
February 03, 2024
0
Tags