ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు : ఆటో డ్రైవర్ మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారి మీదుగా తొర్రూర్ నుండి వరంగల్ వెళుతుండగా మండల కేంద్రం శివారులో బస్సు ముందు వెళ్తున్న గూడ్స్ ర్యాలీ ఆటోను ఓవర్టేక్ చేస్తుండగా వరంగల్ నుండి తొర్రూర్ వైపు వస్తున్న ఆటో బస్సు వెనుక భాగాన ఢీకొట్టగా ఆటో రెండు భాగాలుగా విడిపోయింది. ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య విజయ, కూతురు మౌనిక, కుమారుడు రాజు ఉన్నట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వివరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)