అమెరికాలో సొంతగా కంపెనీ పెట్టలేకపోయాననే బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్‌పూర్ పరిధిలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూర్ మండలం ముత్యాల పల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాశీ విశ్వనాథ్ (38) పటాన్ చెరు పరిధిలోని అమీన్‌పూర్ దుర్గా హోమ్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మాదాపూర్‌లో ఎడాట్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్ కంపెనీని నెలకొల్పిన విశ్వనాథ్, ఆరు నెలల క్రితం అమెరికాలో మరో కంపెనీ పెట్టడానికి వెళ్లాడు. అయితే, అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో కిటికీ ఊచలకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అమీన్‌పూర్ ఎస్ఐ ఈవీ రమణ తెలిపారు. ఈ ఘటనపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును పోలీసులు విచారిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య !
February 28, 2024
0
Tags