ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల విధుల్లో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను వినియోగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నో అబ్జెక్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. కొన్ని షరతులను విధించారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను పోలింగ్ ఆఫీసర్‌కు అసిస్టెంట్‌గా నియమించాల్సి ఉంటుంది. మిస్లేనియస్ పనులు అంటే ఓటరు వేలిపై ఇంకును పూయడం, ఇతర పనుల కోసం మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు లోబడి ఇతర ఎన్నికల పనుల కోసం వారి సేవలను తీసుకోవచ్చు. ప్రతి పోలింగ్ సిబ్బంది పార్టీకి ఒక్క గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగిని మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులను బూత్ స్థాయి అధికారిగా నియమించకూడదు. గ్రామ/వార్డు వలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలి. పోలింగ్ ఏజెంట్లుగా మొదలుకుని ఎలాంటి ఎన్నికల విధుల్లో వారు పాల్గొనకూడదు.
ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగుల వినియోగానికి నో అబ్జెక్షన్ !
February 15, 2024
0
Tags